బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్.. సెహ్వాగ్ సతీమణితో వివాహేతర సంబంధం.. అందుకే?
ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం మిథున్ మన్హాస్‌కు లేకపోయినా.. ఢిల్లీ తరఫున సుదీర్ఘ కాలం రంజీ క్రికెట్ ఆడాడు. ఆ జట్టుకు సారథ్యం కూడా వహించాడు.
వీరేంద్ర సెహ్వాగ్‌కు మిథున్ మన్హాస్ మంచి స్నేహితుడు. ఈ క్రమంలోనే ఆర్తి అహ్లావత్‌తో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసే సెహ్వాగ్..ఆర్తి అహ్లావత్‌ను దూరం పెట్టాడనే వాదన కూడ వినిపిస్తోంది. సెహ్వాగ్‌కు దూరంగా ఉంటున్న ఆర్తి అహ్లావత్.. మిథున్ మన్హాస్‌తో కలిసి సహజీవనం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
గతేడాది సెహ్వాగ్ తన సతీమణి ఆర్తి అహ్లావత్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు.
అప్పటి నుంచి సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ విడి విడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ఆర్తి అహ్లావత్‌కు మిథున్ మన్హాస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్ట్‌లను కూడా తాజాగా వైరల్ అయ్యాయి.
సెహ్వాగ్‌కు మిథన్ మన్హాస్ మిత్ర ద్రోహం చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ విడాకుల వ్యవహారంపై సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ అధికారికంగా స్పందించలేదు.