శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (10:46 IST)

అత్తారింటికి తరచూ వెళ్లే అల్లుడు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు.. భార్య అడిగిందని చంపేశాడు..

crime
అల్లుడు, అత్త మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఒక అమాయకురాలైన భార్య ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన  ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రమోద్ అనే యువకుడు అత్తారింటికి వెళ్లి వస్తుండే వాడు.ఈ క్రమంలోనే అతనికి తన అత్తతో సాన్నిహిత్యం పెరిగి, అది అక్రమ సంబంధానికి దారితీసింది. మొదట్లో ఈ విషయం ఇంటి నాలుగు గోడలకే పరిమితమైంది. 
 
కానీ తాజాగా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం బంధువులు, ఇరుగుపొరుగు వారికి తెలిసింది. అదే సమయంలో ఈ విషయం ప్రమోద్ భార్య శివానికి కూడా తెలియడంతో.. ఆమె తన భర్త ప్రవర్తనపై అనుమానం పెంచుకుంది. 
 
ఇదే విషయంపై ఆమె ప్రమోద్‌ను ప్రయత్నించడంతో తీవ్రమైన గొడవ మొదలైంది. అలా ఓ రోజు మరోసారి ఈ దంపతుల మధ్య ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 
 
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రమోద్ తన భార్య శివానిని దారుణంగా కొట్టాడు. ఆ సమయంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో శివాని కొద్దిసేపటికే మరణించింది. స్థానికులు, బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
Crime
Crime
 
ప్రాథమిక విచారణలో శివాని గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలింది. శివాని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త ప్రమోద్, అత్త, మృతురాలి అత్తమామలపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రమోద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.