శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (10:32 IST)

జనవరి వరకు ఆగండి.. అప్పటివరకు ఏమీ అడగొద్దు.. ధోనీ

ఎంఎస్ ధోనీ తన భవితవ్యంపై నోరు విప్పాడు. వరల్డ్ కప్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టని రాంచీ డైనమైట్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడా? అనే ప్రచారం సాగుతున్న తరుణంలో వచ్చే ఏడాది జనవరి వరకు తనను ఏమీ అడగొద్దని చెప్పేశాడు. అంతవరకు ఆగండి అంటూ అందరి నోళ్లు మూయించాడు. బుధవారం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ధోనీ మాట్లాడాడు.
 
జనవరి నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకున్న ధోనీ.. ఆ తర్వాతే తన క్రికెట్ కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లకు ధోనీ దూరంగా ఉన్నాడు. అసలు సెలక్షన్ కమిటీకి కూడా ధోని అందుబాటులో లేకుండా పోయిన సంగతి తెలిసిందే.