శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (09:47 IST)

28-01-2019 మీ రాశి ఫలితాలు... అవి గోప్యంగా వుంచడం మంచిది...

మేషం: స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. వైద్య రంగాలలోని వారు అరుదైన శస్త్రచికిత్సలు సమర్థంగా నిర్వహిస్తారు. దూరప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం: భాగస్వామిక చర్చలు సంప్రదింపులు ప్రశాంతంగా ముగుస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమ, ప్రయాసలెదుర్కోవలసి వస్తుంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. 
 
మిధునం: మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఉద్యోగస్తులకు బరువుబాధ్యతలు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం: వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడంతో నిరుత్సాహం తప్పదు. ఏజెంట్లు, బ్రోకర్లు, శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఎదుటివారితో వాగ్వివాదులు, పంతాలకు పోవడం మంచిది కాదు.  
 
సింహం: ఉద్యోగ రీత్యా ఆకస్మింగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. ఒంటెద్దు పోకడ మంచిది కాదని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వృద్దాప్యంలో ఉన్నవారికి శారీరక బాధలు, చికాకులు వంటివి సంభవిస్తాయి. 
 
కన్య: ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. పోస్టల్, టేలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగ ప్రయాణం చేయవలసివస్తుంది. చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు.  
 
తుల: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు తీర్పులు ఆందోళన కలిగిస్తాయి. ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్దంగా ఉంటాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
వృశ్చికం: కంప్యూటరం, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: బ్యాంకుల నుండి పెద్ద మొత్తం ధనం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి, సంతానం కోరికలు తీర్చగల్గుతారు. విద్యార్థుల అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు పరిష్కారదిశగా సాగుతాయి. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ప్రధానం. 
 
మకరం: బ్యాంకు డిపాజిట్ల సొమ్ము ముందుగానే తీసుకోవలసివస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉమ్మడి వెంచర్లు, నూతన పెట్టుబడుల నిర్ణయం ప్రస్తుతం తగదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. టీ.వీ. కార్యక్రమాలు, పోటీల్లో స్త్రీలు రాణిస్తారు.    
 
కుంభం: సంఘంలో గౌరవమర్యాదలు, ఆదరణ లభిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలించవు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు. దంపతుల మధ్య పొత్తు పొసగదు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తిచేసి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు.   
 
మీనం: కొనుగోలుదార్లను, పనివారలను గమనిస్తుండాలి. ఇతరుల తప్పిదాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు క్రీడలు, క్యాంపస్ ఎంపికల్లో రాణిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.