కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నానంటే... ధోనీ క్లారిఫై
భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీని తాను ఎందుకు వదులుకున్నానో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్లారిఫై ఇచ్చాడు. ఇదే అంశంపై ఆయన తాజాగా స్పందిస్తూ, 2019 వరల్డ్ కప్ సన్నద్ధత కోసం తర్వాతి కెప్టెన్‌క
భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీని తాను ఎందుకు వదులుకున్నానో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్లారిఫై ఇచ్చాడు. ఇదే అంశంపై ఆయన తాజాగా స్పందిస్తూ, 2019 వరల్డ్ కప్ సన్నద్ధత కోసం తర్వాతి కెప్టెన్‌కు తగినంత సమయం ఇవ్వాలనే ఆలోచనతోనే రిటైర్మెంట్ తీసుకున్నానని తెలిపారు.
ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్.. టెస్ట్ సిరీస్‌లో ఓటమి చవిచూడటానికిగల కారణాలపై స్పందిస్తూ, తగినన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం వల్ల పరిస్థితులకు అలవాటుపడటానికి భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడ్డారన్నాడు.
ఇదిలావుండగా, టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ముందు వరుసలో నిలుస్తాడు. 2014 ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే టెస్టులకు గుడ్‌పై చెప్పేశాడు. 2016లో పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. హఠాత్తుగా ఆ నిర్ణ యం తీసుకోవడం వెనుక కారణాన్ని రెండేళ్ల తర్వాత ధోనీ బయటపెట్టాడు.