సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (13:03 IST)

క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన వ్యాపారవేత్త

cricket balls
క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.. 52 ఏళ్ల వ్యక్తి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మృతుడు జయేష్ చున్నిలాల్ సావ్లా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఆ సమయంలో తలకు బంతి తగిలి స్పృహతప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. ఒక మైదానంలో ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 
 
52 ఏళ్ల వ్యాపారవేత్త అయిన జయేష్.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, మరొక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అకస్మాత్తుగా అతని తలపై తాకడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆపై ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ అప్పటికే జయేష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.