గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (09:14 IST)

వ్యాయామం శరీరానికి సంబంధించింది.. అప్పుడు కూడా మదిలో అల్లా ఉన్నాడు: కైఫ్

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని లక్ష్యం చేసుకున్న ఓ వర్గం అభిమానులు కైఫ్‌పైనా గురి పెట్టారు. సూర్య నమస్కారాలు చేస్తున్న తన ఫొటోలు పోస్టు చేయడం, సూర్యనమస్కారాలు ఎటువంటి పరికరాలు లేని సమగ్ర వ్యాయామం అని

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని లక్ష్యం చేసుకున్న ఓ వర్గం అభిమానులు కైఫ్‌పైనా గురి పెట్టారు. సూర్య నమస్కారాలు చేస్తున్న తన ఫొటోలు పోస్టు చేయడం, సూర్యనమస్కారాలు ఎటువంటి పరికరాలు లేని సమగ్ర వ్యాయామం అని కూడా తన అభిప్రాయం రాయడం కొందరు అభిమానులు, ఫాలోవర్లకు రుచించలేదు. ఇక అతనిపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్‌పై కైఫ్ ఫైర్ అయ్యాడు. 
 
మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సూర్య నమస్కారాలు చేస్తూ దిగిన ఫొటోలు వివాదం సృష్టిస్తున్న  నేపథ్యంలో వివరణ ఇచ్చాడు. వ్యాయామంలో భాగంగా సూర్య నమస్కారాలు చేస్తూ కైఫ్‌ దిగిన ఫొటోలపై క్లారిటీ ఇచ్చాడు. కైఫ్‌ మత విశ్వాసాలను పక్కకు పెట్టారని పలువురు విమర్శలు సైతం గుప్పించడంపై మండిపడ్డాడు. 
 
సూర్య నమస్కారాలు శారీరానికి సంబంధించి, ఎలాంటి పరికరం సాయం లేకుండా చేసే పరిపూర్ణ వ్యాయామం అంటూ ట్వీట్‌ చేశాడు. మతానికి వ్యాయామానికి సంబంధం లేదన్న కైఫ్... వ్యాయామం చేసే సమయంలోనూ తన మదిలో అల్లా ఉన్నాడని తెలిపారు.