బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (14:37 IST)

దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన మహ్మద్ షమీ?

mohammed shami
టీమిండియా స్టార్ బ్యాటర్ మహ్మద్ షమీ దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ముంబైలో చికిత్స తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.   వైద్యులను కలిసేందుకు అతడు ముంబై చేరుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్తాడని బీసీసీఐ సమాచారం 
 
సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం షమీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బాక్సింగ్ డే టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. కేవలం 7 మ్యాచుల్లోనే 10.70 సగటుతో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు కొల్లగొట్టాడు.