బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:08 IST)

వన్డేల్లో ధోనీ రికార్డు.. స్టంపింగ్స్ సెంచరీ

భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. స్టంప్ ఔట్ (స్టంపిం

భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. స్టంప్ ఔట్ (స్టంపింగ్స్) చేయడంలో ధోనీ సెంచరీ కొట్టాడు. 
 
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఈ రికార్డును ధోనీ సాధించాడు. ఈ వన్డేలో 44.6వ ఓవర్‌లో చాహల్ వేసిన బంతిని కొట్టబోయిన శ్రీలంక క్రికెటర్ ధనుంజయను ధోనీ స్టంపింగ్ చేశాడు. 
 
తద్వారా ధోనీ 100 మార్క్‌ను అందుకున్నాడు. దీంతో 99 స్టంప్ ఔట్లతో లంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరిటనున్న ప్రపంచ రికార్డును ధోనీ తిరగరాశాడు. 
 
కాగా, 404 మ్యాచుల్లో  సంగక్కర 99 ఔట్లు చేయగా.. ఈ ఫీట్‌ను ధోనీ 301వ మ్యాచ్‌లోనే అధిగమించడం విశేషం. అత్యధిక స్టంప్ ఔట్ల జాబితాలో భారత్ నుంచి ధోనీ తర్వాతి స్థానంలో నయాన్ మోంగియా (44) ఉన్నాడు.