శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (10:11 IST)

నీకు బుర్రంటూ వుంటే ధోనీని అడుగు.. ఘాటుగా బదులిచ్చిన భజ్జీ

ఆమ్రపాలి సంస్థ విల్లాలు కొనుక్కునే వారిని మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్ర

ఆమ్రపాలి సంస్థ విల్లాలు కొనుక్కునే వారిని మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నెటిజన్ల నుంచి ధోనీ, భజ్జీలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమ్రపాలి సంస్థకు మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ‌ వ్యవహరించాడు. అయితే విల్లాలు కొనుక్కునే వాళ్లను ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ తప్పుకున్నాడు. 
 
ఈ క్రమంలో సోషల్ మీడియాలో భజ్జీని ఉద్దేశించి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోట్లాది రూపాయల విలువ గల విల్లాలను ఆమ్రపాలి సంస్థ ధోనీ, భజ్జీకి కానుకలుగా అందజేసింది. అందుకే మా డబ్బులు మాకు రావట్లేదన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన భజ్జీ అతనికి సమాధానమిచ్చాడు. తాము విల్లాలు అందుకున్నట్లు మీకెవరు చెప్పారని నిలదీశాడు. 
 
అలాంటివి ఏమీ మాకు అందలేదు. మా పేర్లు వాడుకుని ప్రజల నుంచి పలువురు సొమ్ములు చేసుకుంటున్నారని భజ్జీ స్పష్టం చేశాడు. దానికి మరో నెటిజన్ ఆమ్రపాలి సంస్థ యజమానికి ధోనీ మంచి స్నేహితుడు. అందుకే భజ్జీ అసత్యాలు పలుకుతున్నాడంటూ ట్వీట్ చేశాడు. అతనికి భజ్జీ సమాధానమిస్తూ, ఆమ్రపాలి సంస్థ యజమాని ధోనీకి స్నేహితుడు కాబట్టి ధోనీని అడగడం న్యాయం. నీకు బుర్రంటూ వుంటే ధోనీని అడుగు అంటూ ఘాటుగా బదులిచ్చాడు.