గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (13:10 IST)

ముత్తయ్య, ఎంజీఆర్‌లకు మోడీ కితాబు.. శ్రీలంకకు భారత్ పెద్దన్న లాంటివాడన్న స్పిన్నర్..

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు గుప్పించారు. తమిళజాతి ఆణిముత్యం ముత్తయ్య మురళీధరన్ అంటూ మోడీ కొనియాడారు. దీనిపై స్పిన్నర్ కూడా స్పందించారు. తన సందే

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు గుప్పించారు. తమిళజాతి ఆణిముత్యం ముత్తయ్య మురళీధరన్ అంటూ మోడీ కొనియాడారు. దీనిపై స్పిన్నర్ కూడా స్పందించారు.

తన సందేశంలో నరేంద్ర మోడీ లాంటి గొప్ప నేత తన పేరు పలకడం గొప్ప అనుభూతి అని మురళీధరన్ అన్నాడు. 
 
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం డికోయా నగరంలో తమిళ ప్రజలను కలుసుకున్న నరేంద్ర మోడీ.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలోనే మురళీధరన్‌ను, దివంగత ఎంజీఆర్‌ను తమిళజాతి ఆణిముత్యాలుగా మోడీ కీర్తించారు. ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న మురళీధరన్.. ఐపీఎల్ పదో సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నారు. 
 
శనివారం మీడియాతో మాట్లాడిన మురళీ.. మోడీ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌. అలాంటి దేశాన్ని నడిపిస్తోన్న నేత(మోడీ).. శ్రీలంకలో మా(తమిళ) కమ్యూనిటీని గురించి మాట్లాడటం గొప్పవిషయమని మురళీ తెలిపారు. శ్రీలంకకు భారత్ పెద్దన్నలాంటిదని, ఇరు దేశాలది గాఢానుబంధమని గుర్తుచేశాడు.