గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (12:15 IST)

డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ప్లేయర్స్‌‌ను ఓదార్చిన మోదీ.. వీడియో వైరల్

Modi
Modi
ప్రపంచ కప్ ఫైనల్‌లో మరోసారి టీమిండియా చేజారింది. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారూల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది. 
 
మైదానంలోనే రాహుల్, సిరాజ్ వంటి ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకోగా.. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లకు కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే వీళ్లందర్నీ ఓదార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా టీమిండియా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లారు. 
 
రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ తదితరులను కౌగిలించుకొని ఓదార్చారు. ఇదే విషయాన్ని నెట్టింట పంచుకున్న జడేజా.. అభిమానుల మద్దతుతోనే తాము ఇంత దూరం వచ్చామని అన్నాడు.
 
ప్రధాని తమ డ్రెస్సింగ్ రూంకు వచ్చి ఓదార్చడం తమకు చాలా గొప్ప మోటివేషన్ అని చెప్పాడు. మహమ్మద్ షమీ కూడా నెట్టింట తన మనసులోని మాటను చెప్పుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.