సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (10:19 IST)

రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం.. పదిమందికి కరోనా

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది.
 
"ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్‌గా తేలింది పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకే గతవారం ఓ పేడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి." అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేసింది. 
 
కాగా ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు అశ్విన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాను ఐపీఎల్‌కు దూరంగా ఉంటానని తెలిపాడు. ఏప్రిల్ 26న ఈ విషయాన్ని అశ్విన్ ప్రకటించాడు.