బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:29 IST)

వివాహితపై మోజు.. భార్యాపిల్లలను వదిలేసి ఉడాయించిన భర్త!

ఓ వివాహితపై మోజు పడిన భర్త... కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను వదిలివేసి ఉడాయించాడు. ఈ సంఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, కృష్ణా నగర్‌లో నివాసం ఉంటున్న 31 యేళ్ల వ్యక్తి ఆర్‌సీపురంలోని ఓ బైక్‌ షోరూమ్‌లో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ పెళ్లయింది. భార్య(30), కూతురు(6), కొడుకు(4)తో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అతడితో పాటు పనిచేస్తున్న వివాహిత(21)తో నెలరోజుల క్రితం పరిచయమైంది. అప్పటి నుంచి చాటింగ్‌లు చేయసాగాడు. ఈ పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం అతడు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భర్త ఆచూకీ కనిపించక అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం భార్య జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు ఆరా తీయగా కాల్‌ రికార్డ్స్, చాటింగ్స్‌ ఆధారంగా వివాహితతో కలిసి వెళ్లినట్లు తేలింది. లేచిపోయిన వివాహిత భర్త కూడా చందానగర్‌ పీఎస్‌లో భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఉడాయించిన ఇద్దరూ మేజర్లే కావడంతో సమస్య ఎక్కడకు దారితీస్తుందో అని వారు వేచిచూస్తున్నారు.