మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (16:05 IST)

దాడులు మంచిది కాదు.. దేశానికి చెడ్డపేరు వస్తుంది : క్రికెటర్ అశ్విన్

భారత క్రికెట్ జట్టు ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్ళపై దాడులు చేయడం సహేతుకం కాదనీ, ఇలాంటి దాడుల వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందని క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెం

భారత క్రికెట్ జట్టు ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్ళపై దాడులు చేయడం సహేతుకం కాదనీ, ఇలాంటి దాడుల వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందని క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రయాణించే బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ ఘటనను భారత క్రికెట్ జట్టు బౌలర్ ఆర్.అశ్విన్ తప్పుబట్టాడు. బస్సుపై రాళ్లు రువ్వడం సరైన పని కాదని అన్నాడు. ఇలాంటి చర్యలు మన దేశానికి చెడ్డ పేరును తీసుకొస్తాయన్నాడు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయమన్నాడు. అందరూ బాధ్యతాయుతంగా మెలగాలంటూ ట్వీట్ చేశాడు.