గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:52 IST)

పృథ్వీ షా ప్రియురాలితో దిగిన ఫోటోపై నెటిజన్లు జోకులే జోకులు

Rithvi shaw
Rithvi shaw
పృథ్వీ షా భారత జట్టుకు అరంగేట్రం చేసినప్పటికీ, అతను మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవల దేశవాళీ మ్యాచ్‌ల్లో రాణిస్తున్న పృథ్వీ షాకు జట్టులో చోటు దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సాయిబాబా ఫోటోను పోస్ట్ చేస్తూ.. మీరు అన్నీ చూస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంలో, నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, అతని ప్రియురాలు, నటి నితి తప్పాడియా సన్నిహితంగా ఉన్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
 
దీని తర్వాత పృథ్వీ షా దీనిపై పోస్ట్ చేస్తూ..  కొందరు నా ఫొటోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. పృథ్వీ షా, నితి ప్రేమలో ఉన్నారని, ఇటీవల విడిపోయారని పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.