1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:47 IST)

కోలుకున్న రిషబ్ పంత్.. కాలికి కట్టుతో ఫోటో వైరల్

Rishab Pant
Rishab Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలికి కట్టుతో పంత్ దర్శనమిస్తుంది. మొదటిసారి తన ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. బర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్‌ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో పంత్‌కు ప్రాణాపాయం తప్పింది.