శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

సరిగా ఆడలేకపోతున్నానని భావించినపుడు వైదొలుగుతా : రోహిత్ శర్మ

rohit sharma
క్రికెట్‍ మైదానంలో‌నా శక్తి మేరకు రాణించలేకపోతున్నానని భావించినపుడు జట్టు నుంచే కాదు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. రోహిత్ శర్మ క్రికెట్ శకం ముగిసిందని ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ శర్మ వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు. తన ఆట బాగాలేదని అనిపించిన రోజున వెంటనే ఆట నుంచి తప్పుకుంటానని చెప్పారు. తనలో ఆట ఇంకా మిగిలి ఉందని స్పష్టం చేశాడు.
 
'నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి రిటైర్ అవుతా. కానీ నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడు ఏళ్లుగా నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోరులు చేయడం ముఖ్యమేకానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టాను. నేను జట్టులో కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి' అని రోహిత్ శర్మ చెప్పాడు.