ప్రపంచ రికార్డు నెలకొల్పిన నమీబియా క్రికెటర్.. ఎలా?
భారత స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పిన ప్రపంచ రికార్డు మరికాస్త వెనక్కి జరిగిపోయింది. క్రికెట్ పసికూన నమీబియా క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ టీ20 ఫార్మెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో టీ 20 ఫార్మెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా జాన్ నికోల్ అవతరించాదు. మంగళవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నికోల్ ఈ రికార్డును నెలకొల్పాడు. నికోల్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 36 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా కళ్ల ముందే జాన్ నికోల్ రికార్డును కూడా తిరగరాయడం గమనార్హం. 2023లో కేవలం 34 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అలాగే, గత 2017లో రోహిత్ శర్మ 35 బంతుల్లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారాడు.
నెదర్లాండ్స్ కూడా ఆడుతున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా, ఈ మ్యాచ్ జరిగింది. కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్శఇటీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో నేపాల్ 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నీమీబియా ఘన విజయం సాధించింది.
కాగా, టీ20 ఫార్మెట్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ 33 బంతులతో నేపాల్‌పై సెంచరీ చేశాడు. నేపాల్‌పై 34 బంతుల్లో కుశాల్ మల్లా, బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో డేవిడ్ మిల్లర్, శ్రీలంకపై 35 బంతుల్లో రోహిత్ శర్మ, టర్కీపై 35 బంతుల్లో సుధేష్ విక్రమ శేఖర్.