గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

టీమిండియాలో కరోనా కలకలం - పలువురు క్రికెటర్లకు పాజిటివ్

ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువరు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లలో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధవాన్, రుతురాజ్ గ్వైకాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే, నైట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా కరోనా బారినపడ్డాడు. మరో ముగ్గురు సహాయక సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకింది. 
 
కాగా, వెస్టిండీస్ జట్టుతో ఈ నెల 6వ తేదీన టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇది భారత క్రికెట్ జట్టుకు 1000వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌కు భారత్‌కు ముందు కరోనా షాక్ తగలడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.