Smriti Mandhana: స్మృతి మంధాన సిక్స్ ప్యాక్.. ఇందులో నిజమెంత?
Smriti Mandhana
ఈ ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గానూ నిలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించింది. స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ ఫొటో అంటూ కొందరు నెటిజన్లు ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి మంధాన తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐ జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ఫొటో అని స్పష్టంగా అర్థమవుతుంది.
