సోమవారం, 8 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 డిశెంబరు 2025 (14:07 IST)

పలాశ్ ముచ్చల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్మృతి మంథాన

smriti mandhana
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి స్మృతి మంథాన తన వివాహంపై క్లారిటీ ఇచ్చింది. తన స్నేహితుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహం రద్దు అయినట్టు ఆమె ఆదివారం ఓ ప్రటనలో స్పష్టం చేశారు. ఆ ప్రకటనలో తన పెళ్లి రద్దు అయినట్టు ప్రకటించారు. 
 
సంగీత దర్శకుడు, తన స్నేహితుడైన పలాశ్ ముచ్చల్‌తో గత నవంబరు నెల స్మృతి మంథాన పెళ్లి జరగాల్సివుంది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చేరారు. ఆ మరుసటి రోజే పలాశ్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలయ్యారు. అదేసమయంలో పలాశ్ ముచ్చల్ ఓ మహిళతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ పెళ్లి వాయిదా పడింది. ఈ నేపత్యంలో ఆమె ఆదివారం తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇస్తూ ప్రకటన చేశారు. 
 
'గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ, వివాహం రద్దయిందని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్‌ తరపున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది' అని స్మృతి స్టోరీలో రాసుకొచ్చారు.