గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (20:21 IST)

స్మృతి మంధాన అదరగొట్టింది.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు

Smriti Mandhana
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టీ-20 థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఈ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది స్మృతి మంధాన. 
 
దీంతో భారత్ గెలుపును కైవసం చేసుకుంది. 188 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది.  దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. 
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు బంతుల్లో 20 పరుగులు సాధించింది. చివరి మూడు బంతులను ఆడిన స్మృతి మంధాన వరుసగా 4,6,3 బాదింది. 
 
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా.. 16 పరుగులకే పరిమితం అయ్యింది. ఫలితంగా భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు లక్ష్యచేధనలో స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు సాధించింది.