దేశంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్ గుర్తింపు
దేశంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్‌ను గుర్తించారు. డెల్టా తరహా ఉత్పరివర్తనాలతో ఒమైక్రాన్ ఉప సంతతికి చెందిన ఈ కొత్త వేరియంట్ సీహెచ్ 1.1గా గుర్తించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ వేరియంట్‌కు చెందిన 16 కేసులు నమోదు కావడం గ
మనార్హం. అలాగే, గుజరాత్ రాష్ట్రంలోనూ ఓ కేసు వెలుగుచూసింది.
సెకండ్ వేవ్‌నకు ప్రధాన కారణమై లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న అత్యంత ప్రమాదకర డెల్టా వేరియంట్‌లో ఉన్నట్టుగానే సీహెచ్ 1.1లోనూ ఉత్పరివర్తనాలు ఉండటంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ వేరియంట్‌లో రోగ నిరోధకతను తప్పించుకునే లక్షణాలతో పాటు డెల్టాలోని ఆర్ మ్యుటేషన్‌ను కలిగి ఉండటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.