శుక్రవారం, 15 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (15:09 IST)

అతడు తెల్లటి వస్త్రంలాంటివాడు.. భారత్‌ కోసమే జీవిస్తాడు.. మరణిస్తాడు కూడా.... ఎవరా క్రికెటర్?

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి క్రికెట్ జంబో అనిల్ కుంబ్లే చేసిన రాజీనామా ఇప్పుడు భారత క్రికెట్‌ను కుదిపేస్తోంది. కుంబ్లే రాజీనామాకు కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమనే వార్తలు గుప్పుమన్నాయి. అంతే.. నెట

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి క్రికెట్ జంబో అనిల్ కుంబ్లే చేసిన రాజీనామా ఇప్పుడు భారత క్రికెట్‌ను కుదిపేస్తోంది. కుంబ్లే రాజీనామాకు కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమనే వార్తలు గుప్పుమన్నాయి. అంతే.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లీని ఏకిపారేస్తూ.. అనిల్ కుంబ్లేను భరతమాత ముద్దుబిడ్డగా అభివర్ణిస్తున్నారు. 
 
"అనిల్ కుంబ్లే... నిబద్ధత, నైపుణ్యంగల కోచ్.. అత్యంత నిజాయితీ పరుడు కూడా. తలపై బ్యాండేజ్ కట్టుకుని భారత్ విజయం కోసం బంతులు వేసిన ఆటగాడు.. తెల్లటి వస్త్రంలాంటివాడు.. అతడు భారత్ కోసమే జీవిస్తాడు.. దాని కోసం మరణించేందుకు కూడా వెనుకాడడు" అంటూ ట్విటర్‌లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది.
 
అంతేనా... "టీమ్ ఇండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా చేశాడు. దేశం కోసం అతడు చేయగలిగిందంతా చేశాడు. ఓ దిగ్గజం పట్ల మనం వ్యవహరించిన దానికి సిగ్గుతో ఉరేసుకుందాం.." అని మరో నెటిజన్ ఆవేదన వెళ్లగక్కాడు. "అనిల్ కుంబ్లే భారత్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.. ఇప్పుడు బీసీసీఐ రెండు పోస్టులు భర్తీ చేయాలి. ఒకటి కోచ్... రెండోది మంచి ఫొటోగ్రాఫర్..." ఇలా వరుసపెట్టి నెటిజన్లు ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో అటు కోహ్లీతో పాటు.. ఇటు బీసీసీఐ నిర్వరణ కమిటీ కూడా దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. 
 
కాగా, అనిల్ కుంబ్లే అత్యంత క్రమశిక్షణ గల క్రీడాకారుడనీ... దేశానికి విశేష సేవలందించిన అతడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన కోహ్లీ సహా టీమిండియా ఆటగాళ్లు సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.