గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (17:48 IST)

లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో దాదా.. బ్యాట్ పడితే ఇక బాదుడే

లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్ఎల్‌సీ)లో ఆడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ సిద్ధమవుతున్నాడు. తద్వారా గంగూలీ తిరిగి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 
 
ఈ విషయాన్ని తనే ధ్రువీకరించాడు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యం, మహిళా సాధికారత కోసం టాప్ లెజెండ్స్‌తో కలిసి లెజెండ్ లీగ్ క్రికెట్‌లో షాట్లు కొట్టేందుకు సిద్ధమవుతున్నానని ఇన్ స్టా ద్వారా తెలియజేశారు. ఇంకా జిమ్‌లో కసరత్తు చేస్తోన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. 
 
మరోవైపు ఈ క్రికెట్‌లో గంగూలీ ఆడటం హ్యాపీగా వుందని లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్ఎల్‌సీ) సీఈవో, సహ వ్యవస్థాపకుడు రామన్ రహెజా హర్షం వ్యక్తం చేశాడు. దాదా ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నామని తెలిపాడు.