మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (09:42 IST)

అవును.. మేమిద్దరం స్వలింగ సంపర్కులం.. వివాహం చేసేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు..

దక్షిణాఫ్రికా మహిళా జట్టు క్రికెటర్లు మరిజాన్ కాప్, వాన్ నికెర్క్‌లు వివాహం చేసుకున్నారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి కాదని, 2017లో కివీస్‌కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్ వై

దక్షిణాఫ్రికా మహిళా జట్టు క్రికెటర్లు మరిజాన్ కాప్, వాన్ నికెర్క్‌లు వివాహం చేసుకున్నారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి కాదని, 2017లో కివీస్‌కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్ వైట్, లియా తహుహులు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము స్వలింగ సంపర్కులమని ధైర్యంగా ప్రకటించిన వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. 
 
2009 ప్రపంచ కప్ టోర్నీ నుంచి జట్టులో ఆడుతున్న నికెర్క్ 2017-18 సంవత్సరానికి గాను అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మహిళా బౌలర్‌గానూ నికెర్క్ నిలిచింది. 
 
అలాగే కాప్.. ఐసీసీ టాప్-10లో కొనసాగుతోంది. వీరిద్దరూ గతంలో దక్షిణాఫ్రికా బాలుర అకాడమీలో శిక్షణ పొందిన మహిళా క్రికెటర్లుగా వీరిద్దరూ గుర్తింపు సంపాదించుకున్నారు. వన్డేల్లో 1770 పరుగులతో వాన్ ఐసీసీ ర్యాంకులో టాప్-4గా నిలిచింది. కాప్-వాన్ ఇద్దరూ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడారు. నవంబర్ 2014 మైసూరులో జరిగిన టెస్టులో, కాప్, వాన్ 82 పరుగులు, 56 పరుగులు సాధించారు.