న్యూజిలాండ్-పాకిస్తాన్ టీ-20కి సూర్యుడు అడ్డుపడ్డాడా?

cricket stadium
cricket stadium
సెల్వి| Last Updated: శనివారం, 26 డిశెంబరు 2020 (16:41 IST)
క్రికెట్ మ్యాచ్‌లకు సాధారణంగా వరుణుడే ఆటంకం కలిగిస్తాడు. అయితే న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ సమయంలో ఈ అరుదైన ఘటన జరిగింది. మ్యాచ్ ఆడే సమయంలో సూర్యుడు మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. కాగా మెక్ లీన్ పార్క్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ సమయంలో ఈ అరుదైన ఘటన జరిగింది.

మూడో టీ20 మ్యాచ్‌కు ఉన్నట్టుండి సూర్యుడు అడ్డుపడ్డాడు.. ఆటను మధ్యలోనే ఆపేశాడు. అసలేం జరిగిందంటే?.. పాక్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. అదే సమయంలో సూర్యుడు వచ్చి బ్యాట్స్‌మెన్లకు అడ్డంగా నిలబడ్డాడు. సూర్యకాంతి నేరుగా కళ్లపై పడటంతో ఆటగాళ్లకు బంతిని చూడటం కష్టంగా మారింది. దాంతో సూర్యుడు షిప్ట్ మారేంతవరకు ఆట ఆపేశారు.

సూర్యుడు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఇలాంటి ఘటనే 2019లో జనవరిలో ఇదే మైదానంలో జరిగింది. అప్పుడు వన్డే మ్యాచ్ జరుగుతోంది. వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాతో మ్యాచ్ జరిగింది. అదే సమయంలో సూర్యుడు అడ్డంకిగా నిలిచి మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఇప్పుడు పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ కు మళ్లీ సూర్యుడు అడ్డుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై మరింత చదవండి :