శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:40 IST)

సింగర్ సునీత ప్రి-వెడ్డింగ్‌లో హీరో నితిన్ కూల్ డ్రింక్‌లు ఇచ్చారట (Video)

ప్రముఖ గాయని సునీత రెండో పెళ్ళి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో ఇటీవలే ఆమె నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరిలో వీరి పెళ్ళి జరుగబోతోంది. ఇదిలా ఉంటే పెళ్ళి దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు.
 
గచ్చిబౌలిలోని స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ మాజీ భార్య రేణు దేశాయ్ హాజరయ్యారు. అలాగే యాంకర్ సుమ కూడా పాల్గొని సందడి చేశారు. యంగ్ హీరో నితిన్ కూడా కార్యక్రమానికి హాజరై దగ్గరుండి పనులను చేశారట.
 
దీనికి కారణం సునీతకు కాబోయే భర్త నితిన్‌కు అత్యంత సన్నిహితుడట. అందుకే దగ్గరుండి పనులు చేశాడట. వచ్చిన విఐపిలను స్వయంగా నితిన్ దగ్గరుండి పిలిచి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారట. అసలు నితిన్ ఎందుకలా చేస్తున్నారని మొదట్లో అక్కడున్న వారికి అర్థం కాలేదట. అయితే ఆ తరువాత తెలుసుకుని సైలెంట్‌గా ఉండిపోయారట.