శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (21:35 IST)

పడవలో ప్రి-వెడ్డింగ్ ఫోటో షూట్... బోల్తా కొట్టి వధూవరులు దుర్మరణం-video

కర్నాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రి-వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం పడవ ఎక్కిన వధూవరులు అది బోల్తా పడటంతో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన చంద్ర- శశికళ ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్నారు.
 
కార్తీక మాసంలో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో కాబోయే దంపతులు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు సిద్ధం అయ్యారు. బోట్ పైన క్లిక్ కోసం ఇద్దరు స్టిల్ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తున్నాడగానే పడవ నీటిలో బోల్తా పడింది. దాంతో కాబోయే జంట నీట మునిగి మృతి చెందారు.
మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధూవరులు ఇలా మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు.