1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (15:04 IST)

ఐపీఎల్‌కు బైబై చెప్పేసిన సురేష్ రైనా.. కెరీర్ హైలైట్స్ ఇవే

suresh raina
భారత వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా ఐపీఎల్‌కు బైబై చెప్పేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వన్డే, టీ20ల్లో మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన 35 ఏళ్ల రైనా.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.  
 
ధోనీతో పాటు చాన్నాళ్లు ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, 2021 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో అతను లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్‌లో రైనాని చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 
 
మిగతా ఫ్రాంచైజీలు కూడా అతడిని జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అటు దేశవాళీ క్రికెట్‌లో సైతం అవకాశాలు రావడం లేదు. దాంతో, అన్ని ఫార్మాట్లకు దూరం కావాలని రైనా నిర్ణయం తీసుకున్నాడు.  
 
రైనా కెరీర్ హైలైట్స్ ..
205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. 
ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
టీమిండియా తరుపున 226 వన్డేలు ఆడిన రైనా 5615 పరుగులు సాధించాడు. 
78 టీ20లు, 18 టెస్టుల్లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా 8 వేల పరుగులు చేశాడు. 
మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన భారత తొలి ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.