శనివారం, 14 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (12:29 IST)

50 రోజుల్లో వన్డే ప్రపంచకప్- తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రోఫీ

ICC Trpophy
ICC Trpophy
అక్టోబరు 5న భారత్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని దేశాల్లో జర్నీ చేస్తోంది.

తాజాగా ఈ ట్రోఫీ తాజ్ మహల్‌కు చేరుకుంది. తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీని తాజ్ మహల్ చిత్రంతో  చూపించారు. ఈ ప్రత్యేక ట్రోఫీ యాత్ర జూన్ 27న భారతదేశంలో ప్రారంభమైంది. 
 
అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత, ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. ఈ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న 18 ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఇది సెప్టెంబర్ 4న భారత్‌కు తిరిగి వస్తుంది.

కేవలం 50 రోజుల్లో భారత్‌లో భారీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.