గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (18:40 IST)

కోహ్లీ వరల్డ్ కప్ గెలిచి తీరుతాడంతే.. హర్భజన్ సింగ్ కితాబు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్‌ను కోహ్లీ తప్పక గెలిచి తీరుతాడని.. కోహ్లీలో ఆ పట్టుదల ఉంది అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ రిటైరయ్యాడు అంటే అది కేవలం వరల్డ్ కప్ సాధించిన తర్వాతే అంటూ వెల్లడించాడు. కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమ ఆటగాడని, అతని కెప్టెన్సీపై నైపుణ్యం ఎంతగానో బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. 
 
భారత జట్టుకు రెండు ప్రపంచకప్ లను అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు రెండు ప్రపంచ కప్‌లకు సారథ్యం వహించినప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి హర్భజన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.