సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ : అమీతుమీకి సిద్ధమైన భారత్

icct20worldcup
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి భారత్ వర్సెస్ జింబాబ్వే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేగీ మోగించి సెమీస్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తుంది. ఒకవేళ జింజాబ్వే చేతిలో ఓడిపోతే మాత్రం భారత్ ఇంటిదారి పట్టక తప్పదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు మ్యాచ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతాయి. ఇంకో మ్యాచ్‌లో సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్‌లలో ఆయా జట్ల విజయావకాశాలపై సెమీస్ బెర్తులు ఖరారుకానున్నాయి. ఇప్పటికే గ్రూపు-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో గ్రూపు-1 జట్లతో తలపడే జట్లు ఖరారుకానుంది. 
 
తొలుత పాకిస్థాన్ బంగ్లాదేశ్, తర్వాత సౌతాఫ్రికా నెదర్లాండ్స్, ఆ తర్వాత భారత్, జింబాబ్వే జట్లు తలపడతాయి. భారత్ జింబాబ్వే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూపు-2లో మొత్తం ఆరు జట్లు ఉండగా, అన్ని జట్లూ ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. 
 
ఈ నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు నమోదు చేసిన భారత్ ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అంతేకాకుండా, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లండ్‌తో ఫైనల్ బెర్తు కోసం తలపడుతుంది.