మంగళవారం, 22 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మే 2016 (19:46 IST)

సచిన్‌తో కోహ్లీని పోల్చడమా నోనో.. విరాట్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్: సెహ్వాగ్

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లీతో పోల్చవద్దని డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. ఫామ్ లేమి కారణంగా కామెంటేటర్‌, మెంటార్ మారిన సెహ్వాగ్ సచిన్‌ను బ్యాటింగ్ లెజెండ్‌గా, విరాట్ కోహ్లీని కరెంట్ రన్ మిషన్‌‌గా అభివర్ణించడం దారుణమన్నారు. తననూ, సచిన్‌ను, తనను, వివిఎన్ రిచర్డ్స్‌ను కూడా పోల్చేవారని, అది తగదని సెహ్వాగ్ తెలిపాడు. 
 
అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీని మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ అభివర్ణించారు. కొన్ని నెలలుగా కోహ్లీ అత్యద్భుతంగా ఆడుతున్నాడన్నాడు. క్రికెట్లో సచిన్, వీవీఎన్ రిచర్డ్స్ శకానికి తిరుగులేదని.. సచిన్‌తో కోహ్లీని పోల్చితే అతను ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని చెప్పాడు.