టీ20 సిరీస్: యూఎస్ఏ సంచలనం.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ అరుదైన ఘనత సాధించింది. హౌస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాపై అమెరికా అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా టీ20 క్రికెట్‌లో యూఎస్ఏ సంచలనం సృష్టించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో యునైటెడ్ స్టేట్స్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బంగ్లా ఆటగాళ్లలో తౌహిద్ (58; 47 బంతుల్లో, 4x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే అమెరికా ఆటగాళ్లలో ఆండర్సన్ (34 పరుగులు ; 25 బంతుల్లో, 2x6), హర్మీత్ సింగ్ (33 పరుగులు; 13 బంతుల్లో, 2x4, 3x6) బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.