గురువారం, 21 ఆగస్టు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2025 (11:21 IST)

లండన్ వీధుల్లో సామాన్యుడిలా చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ

virat kohli - anushka
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి లండన్ వీధుల్లో సామాన్యుడిలా చక్కర్లు కొడుతున్నారు. భారత్‌లో ఉండే అభిమానుల కోలాహలానికి దూరంగా సాదాసీదా సామాన్యుడిలా లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కోహ్లీ, అనుష్క స్థానికులతో ముచ్చటిస్తున్నట్టు కనిపిస్తోంది. తమను గుర్తుపట్టిన వారితో ఈ సెలెబ్రిటీ జంట నవ్వుతూ పలకరించడం, సరదాగా మాట్లాడటం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా వారు తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. 
 
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు‌కు టైటిల్ అందించిన తర్వాత కోహ్లీ ఈ విరామం తీసుకున్నారు. కాగా, ఈ యేడాది మే నెలలో ఆయన టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెల్సిందే.