ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రెస్టారెంట్‌లో హుక్కా పీలుస్తూ కెమెరా కంటికి చిక్కిన విరాట్ కోహ్లీ!!

virat kohli
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హుక్కా పీలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. వన్ 8 రెస్టారెంట్‌లో ఆయన అలా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో పోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఫిట్నెస్ విషయంలో యూత్‌కు ఒక ఐకాన్‌లా ఉండే కోహ్లీ... హుక్కా పీలుస్తూ కెమెరా కంటికి చిక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ కూడా పొగతాగుతాడా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. తనకు చెందిన వన్ 8 రెస్టారెంట్‌లో అలా కనిపించాడు. కాగా, కోహ్లీ సతీమణి అనుష్క ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చి లండన్‌లో ఉన్న విషయం తెల్సిందే.