1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Virat Kohli completes 15,000 runs in ODI cricket

'మాస్టర్ బ్లాస్టర్' రికార్డు మాయం... అరుదైన క్లబ్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ

virat kohli
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టారు. తిరువనంతపురంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ వన్డేల్లో ఏకంగా 15 వేల పరుగులు చేసి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఫలితంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు మాయమైపోయింది. అయితే, వన్డేలు, టెస్టులు, టీ20ల్లో కలుపుకుని అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రికార్డు మాత్రం సచిన్ పేరుమీదే ఉంది. 
 
కాగా, సచిన్ టెండూల్కర్ 463 మ్యాచుల్లో.. 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. కోహ్లీ 315 వన్డేల్లో 15 వేలకుపైగా పరుగులు చేశాడు. అయితే, సచిన్ ఈ మార్క్‌ను అందుకోవడానికి 377 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కానీ, కోహ్లీ మాత్రం 303 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి సచిన్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్‌కు దూరంగానే రోహిత్ శర్మ 11,927 పరుగులతో చేరువలో ఉన్నాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వెస్టిండీస్‌తో తొలి వన్డే : భారత్ విజయలక్ష్యం 296 రన్స్