సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (12:09 IST)

హార్దిక్ పాండ్యాపై కేక్ దాడి.. రివేంజ్ తీర్చుకుంటానని శపథం.. (వీడియో)

హార్దిక్ పాండ్యాపై కేక్ దాడి జరిగింది. ఈ దాడి చేసిన వారెవరో కాదు.. ఈ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కేక్ దాడి చేసింది.. ఆయన సహచరులే. అసలు ఈ కేక్ దాడి చేయడానికి అతని పుట్టిన రోజే కారణం. ఇటీవల

హార్దిక్ పాండ్యాపై కేక్ దాడి జరిగింది. ఈ దాడి చేసిన వారెవరో కాదు.. ఈ టీమిండియా ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యాపై కేక్ దాడి చేసింది.. ఆయన సహచరులే. అసలు ఈ కేక్ దాడి చేయడానికి అతని పుట్టిన రోజే కారణం. ఇటీవల పాండ్య తన 24వ పుట్టిన రోజు వేడుకను సహచరుల సమక్షంలో కేక్ కట్ చేసి జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్య కేక్ కోస్తుండగానే అక్షర్ పటేల్.. పాండ్య తలకు కేక్ రాయగా, మనీష్ పాండే చేతికి అందినంత కేక్‌ను తీసుకుని అతని ఒంటికి పులిమాడు. 
 
ఇంతలో యజువేంద్ర చాహల్ చేతుల నిండా కేక్ తీసుకుని  పాండ్య ముఖానికి రాసేశాడు. రోహిత్ శర్మ కేక్ ముక్క తీసుకుని దూరం నుంచే అతని మొహం మీదకు కొట్టాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన పాండ్య, ఏడాదిలో ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు వేడుక చేసుకోవాల్సిందేనని, స్వీట్ రివేంజ్ తీర్చుకుంటానని శపథం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.