సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (12:20 IST)

మాస్టర్.. మాంసాహారాన్ని మానేసి.. శాకాహారాన్ని భుజించాలి.. హోటళ్లలో కూడా?

సోషల్ మీడియా ప్రభావంతో ఏ చిన్న పనిచేసినా అది వైరల్ అవుతోంది. ఇంకా మంచి చేసినా విమర్శిస్తూ, సెటైర్లు విసురుతూ కామెంట్లు వస్తున్నాయి. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంచి చేసినా..దానిపై విమర్శ

సోషల్ మీడియా ప్రభావంతో ఏ చిన్న పనిచేసినా అది వైరల్ అవుతోంది. ఇంకా మంచి చేసినా విమర్శిస్తూ, సెటైర్లు విసురుతూ కామెంట్లు వస్తున్నాయి. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంచి చేసినా..దానిపై విమర్శలు తప్పలేదు.
 
ఇంతకీ ఏం చేశాడంటే..? సచిన్ ఇంటి బాల్కనీలోకి ఓ పక్షి వచ్చింది. దప్పికతో, గాయాలతో ఎగురలేని పరిస్థితిలో వున్న దానిని గమనించిన సచిన్.. ఆహారం, నీటిని అందించాడు. అయినా ఆ పక్షి కదలలేక పోయింది. దీంతో, చివరకు ఆయన ఓ ఎన్జీవోకు ఫోన్ చేశాడు.
 
సచిన్ నివాసానికి చేరుకున్న ఎన్జీవో సిబ్బంది.. దానికి వైద్యం అందించారు. మూడు రోజుల తర్వాత పక్షి పూర్తిగా కోలుకుంది. స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరిపోయింది. ఈ వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
మానవత్వంతో సచిన్ చేసిన పనిని నెటిజన్లు అభినందించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం.. అన్నీ జీవులపై ఇదే ప్రేమను చూపెట్టాలని.. మాంసాహారాన్ని పక్కనబెట్టాలని, శాకాహారాన్ని తీసుకుంటూ.. సచిన్ నిర్వహించే హోటళ్లలో కూడా శాకాహారాన్నే అందించాలంటూ సెటైర్లు విసిరారు.