సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (12:02 IST)

నాటు నాటు పాట: సిగ్నేచర్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్

sunil gavaskar
95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో నాటు నాటు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీమ్‌కి భారతదేశం నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటలోని సిగ్నేచర్ స్టెప్ వేశారు. 
 
ఈ స్టెప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్నప్పుడు, భారత మాజీ కెప్టెన్ అయిన సునీల్ గవాస్కర్ ఆర్ఆర్ఆర్ జట్టును అభినందించి, మరెన్నో అవార్డులలో ఇది మొదటిది కావచ్చునని కామెంట్స్ చేశారు. 
 
ఇంకా గవాస్కర్ మాట్లాడుతూ భారత జట్టు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో నాటు నాటుకు నృత్యం చేసి ఉంటుందని.. అన్నారు. భారత క్రికెటర్లు బౌలర్ ట్యూన్‌లకు బాగా డ్యాన్స్ చేయగలరని, అయితే నాటు నాటుకు అవసరమైన ఫుట్‌వర్క్‌ను వారు సులభంగా సరిపోల్చలేరని గవాస్కర్ చమత్కరించాడు.