సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (13:50 IST)

నాటు నాటు పాటకు ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు రోజా అభినందనలు

Roja
నాటు నాటు పాట కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ టూరిజం మంత్రి, టాలీవుడ్ సీనియర్ నటి ఆర్కే రోజా తన అభినందనలు తెలియజేశారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు పాట గొప్పతనాన్ని రాజమౌళి అండ్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిందని కొనియాడారు. 
 
ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం అందర్నీ గర్వించేలా చేసిందని మంత్రి రోజా అన్నారు. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిందని, రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ తదితరుల సమిష్టి కృషి వల్లే నాటు నాటు పాట విజయవంతమైందని రోజా పేర్కొన్నారు.