గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (16:28 IST)

అట్లాంటా ఓపెన్: 77బంతుల్లో 205 పరుగులు (video)

rahkeem cornwall
rahkeem cornwall
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రఖీమ్ కార్న్ వాల్ రికార్డులను బ్రేక్ చేశాడు. అట్లాంటా ఓపెన్ (అమెరికా టీ20 కాంపిటిషన్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 77బంతుల్లో 205 పరుగులు సాధించాడు. 
 
టీ-20ల్లో డబుల్ సెంచరీతో కార్న్‌వాల్ రికార్డు నమోదు చేశాడు. తాను 360 డిగ్రీల్లో ఆడగలిగే ఆటగాడినని కార్న్‌వాల్ పేర్కొన్నాడు. తన సిక్సర్ల బాదుడు చాలా సహజమేనని తెలిపాడు.
 
మ్యాచ్‌లో భాగంగా కార్న్‌వాల్.. 22 బంతులను సిక్సర్లుగా మలిచాడు. 17బంతులను బౌండరీలకు పంపాడు. అంటే 200 పరుగులను అతడు వికెట్ల మధ్య పరుగులు తీయకుండానే సాధించాడు. కార్న్ వాల్ భారీ కాయంతో ఉంటాడు. అయినా రికార్డుల మోత మోగిస్తున్నాడు.