సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (16:12 IST)

వివాదంలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెటర్

Mohammad Rizwan
Mohammad Rizwan
పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో నమాజ్ చేశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు.
 
ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడింది. "భారత ప్రేక్షకుల ముందు, తన మతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడం అన్నది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం" అని వినీత్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
శ్రీలంకపై తన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు రిజ్వాన్ చేసిన ప్రకటన కూడా వివాదాస్పదం కావడం గమనార్హం. దీనికి ఇజ్రాయెల్ గట్టిగానే బదులిచ్చింది. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.