ఐపీఎల్-9లో వందో మ్యాచ్ ఆడిన డ్వేన్ బ్రావో: 24.51 సగటుతో 1054 రన్స్
ఐపీఎల్-9 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో తన వందో మ్యాచ్‌ను ఆడాడు. ప్రస్తుతం సీజన్‌లో నూతన ఫ్రాంఛైజీ గుజరాత్ లయన్స్ తరపున బ్రావో ఆడుతున్నాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను కలుపుకుంటే ఇప్పటివరకు 300 ట్వంటీ-20 మ్యాచ్‌లను బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ నిర్వహించింది.
గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి బ్రావో అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరుస్తున్నాడు. కెరీర్‌లో 61 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడిన బ్రావో 24.51 సగటుతో 1054 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో బ్రావో సాధించిన సగటు కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహించాడు.