ఎస్వీ యూనివర్సిటీ మెస్.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెస్‌లో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల భోజనంలో జెర్రీ కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీ-బ్లాక్ మెస్‌లో రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థుల ప్లేట్‌లో జెర్రీ ప్రత్యక్షమైంది. కొందరు విద్యార్థులు కలిసి భోజనం చేస్తుండగా జెర్రీని గుర్తించారు.
అంతే కోపంతో విషయాన్ని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మధ్యనే భోజనంలో బొద్దింకను చూసిన స్టూడెంట్స్ ఇప్పుడు జర్రీని చూసి మెస్ సిబ్బందిని నిలదీశారు.
జెర్రీ పడ్డ మాట వాస్తవమని అంగీకరించిన మెస్ నిర్వాహకులు.. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని చెప్పి గొడవను అంతటితో ముగించాడు. కాగా, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు.