టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై: డ్రెస్సింగ్‌ రూంలో మాత్రం ఉద్వేగానికి..?

Selvi| Last Updated: బుధవారం, 31 డిశెంబరు 2014 (14:38 IST)
టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ మంగళవారం నాడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని కూడా విలేకరుల సమావేశంలో ఎలాంటి భావోద్వేగం లేకుండా మ్యాచ్ గురించి మాట్లాడేసి వెళ్లిపోయాడు.

అయితే, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో మాత్రం కొంత ఉద్వేగానికి గురయ్యాడు. భారత దేశానికి అత్యధిక మ్యాచ్‌లు నాయకత్వం వహించని, అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్, టెస్టుల్లో టీమ్ ఇండియాను నెంబర్ వన్‌గా నిలిపిన సారథి, వరుసగా 11 సిరీస్‌లలో ఓటమి ఎగరని ధోనీ, భారత్‌కు అత్యధిక సిరీస్ విజయాలు సాధించాడు.

టెస్టు కెప్టెన్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. టెస్ట్ సారథిగా ఇన్ని ఘనతలు సాధించిన వ్యక్తి ధోనీ. మరోవైపు, విదేశాల్లో అత్యధిక సిరీస్‌లు, అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ ధోనీయే కావడం గమనార్హం.

విదేశాల్లో అత్యంత ఘోర పరాభవాలు ఎదురైంది కూడా అతడి నాయకత్వంలోనే. సారథిగా ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో అన్ని విమర్శలు వచ్చాయి. సారథిగా స్వర్ణయుగం చూడటంతో పాటు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే అతను ప్రశంసలకు పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు. ఏ సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉన్నాడు. తన పని తాను చేసుకు పోయాడు. అయితే టెస్టు ఫార్మాట్‌కు మాత్రం ధోనీ గుడ్ బై చెప్పేశాడు.దీనిపై మరింత చదవండి :