ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 23 జనవరి 2017 (03:40 IST)

కన్నీరు పెట్టిన కేదార్.. స్టాండిగ్ ఒవేషన్‌తో నీరాజనం పలికిన టీమిండియా

దాదాపు 20 ఏళ్ల క్రితం చెన్నయ్‌లో జరిగిన ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు వ్యక్తిగత స్కోరు చేసి కూడా భారత జట్టును గెలిపించలేకపోయిన బాధను జీవితాంతం మర్చిపోలేనని సచిన్ టెండూల్కర్ పదే పదే గుర్తు చేసుకునేవాడు. ఇన్నేళ్ల తర్వాత టీమిండియా కొత్త మ

దాదాపు 20 ఏళ్ల క్రితం చెన్నయ్‌లో జరిగిన ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు వ్యక్తిగత స్కోరు చేసి కూడా భారత జట్టును గెలిపించలేకపోయిన బాధను జీవితాంతం మర్చిపోలేనని సచిన్ టెండూల్కర్ పదే పదే గుర్తు చేసుకునేవాడు. ఇన్నేళ్ల  తర్వాత టీమిండియా కొత్త మెరుపు బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ అలాంటి పరిస్థితినే ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఎదుర్కున్నాడు. విజయానికి అతి సమీపంలోకి జట్టును తీసుకు వచ్చి కూడా దురదృష్టవశాత్తు 50 ఓవర్ చివరి రెండో బంతికి ఔటైన జాదవ్ అదే అనుభవాన్ని చవిచూశాడు. ఆటలో గెలుపోటములు పక్కనపెట్టి చూస్తే ఇది కేదార్ జాదవ్ వ్యక్తిగత విజయం అనే చెప్పాలి. 
 
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం  ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ భరితం ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను విజయానికి అతి దగ్గరగా చేర్చేందుకు కేదార్ జాదవ్ తీవ్రంగా యత్నించాడు. 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 75 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన  సమయంలో వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. కానీ తర్వాత ఐదో బంతికి సిక్సర్ బాదడానికి ప్రయత్నించి అనుకోకుండా బౌండరీ వద్ద క్యాచ్ ఔటయ్యాడు. మరో ఆరు పరుగులు సాధిస్తే భారత్ గెలుస్తుందన్న తరుణంలో కేదార్ జాదవ్ అవుట్ అయ్యాడు. తానే గెలిపించాలనుకున్న మ్యాచ్‌లో కీలకమైన సమయంలో అవుట్ అవడంతో కేదార్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విచారంతో అడుగులు వేస్తూ డ్రెసింగ్ రూం వైపు అడుగులు వేశాడు. 
 
ఆ సమయంలో జట్టు సభ్యులందరూ కుంబ్లే, కోహ్లీ, ధోనీ సహా డ్రెసింగ్ రూంలో ఉన్న సహచరులంతా లేచి నిలబడి చప్పట్లతో కేదార్‌ను అభినందనల్లో ముంచెత్తారు. కానీ జాదవ్ మాత్రం తల వంచుకుని ఎవరి వంకా చూడకుండా నీరసంగా కనిపించాడు. మ్యాచ్ గెలిపించి ఉంటే బాగుండేదనే నిరుత్సాహంతో తలవంచుకుని ఉండిపోయాడు. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా కేదార్ జాదవ్ పోరాట పటిమను అంతా ప్రశంసించారు. అయితే ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డు అందుకున్న సమయంలో మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కూడా గెలిచి ఉంటే తాను చాలా సంతోషంగా ఉండేవాడినని అన్నాడు. తర్వాత మ్యాచ్‌లలో మరింత బాగా రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు జాదవ్. 
 
చివర్లో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ అంత కామ్‌గా ఎలా ఉండగలిగావని ప్రశ్నించగా ధోనీతో గడిపి తనకు కూడా ధోనీలా కామ్‌గా ఉండటం అలవాటయ్యిందని చెప్పాడు. జాదవ్ ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ధోనీ చిరునవ్వులు చిందించాడు. మ్యాచ్ అనంతరం జాదవ్ మాట్లాడుతూ.. ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు కోహ్లీ తనకు మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేయాలో నేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పాడని వివరించాడు. అందుకే ఈ రోజు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాండ్యాతో కూడా తాను అదే చెప్పానని తెలిపాడు జాదవ్. చివరి వరకు బ్యాటింగ్ కొనసాగిద్దామంటూ కోహ్లీ తనకు చెప్పిందే పాండ్యాకు చెప్పానని, కానీ చివరకు మ్యాచ్‌ను గెలిపించలేకపోయామన్నాడు. గెలిచి ఉంటే మరింత సంతోషంగా ఉండేవాడినని చెప్పాడు.  మొదటి వన్డేలో 120, సెకండ్ వన్డేలో 22, మూడో వన్డేలో 90 మొత్తంగా మూడు వన్డేల్లో కలిపి 232 పరుగులు చేశాడు. దాంతో పాటు ఇటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టడంతో జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.