ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (09:28 IST)

50 శాతం ఫిట్‌నెస్ ఉన్నా సరే కోహ్లీ ఆడాల్సిందే అంటున్న సునీల్ గవాస్కర్

గాయం కారణంగా ధర్మశాలలో జరుగనున్న నాలుగో టెస్టులో 50 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాసరే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొనాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. గాయం కారణంగా కోహ్లీ నాలుగో టెస్టులోనూ పరుగులు చేయకపోయినా పర్వాలేదు కానీ

గాయం కారణంగా ధర్మశాలలో జరుగనున్న నాలుగో టెస్టులో 50 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాసరే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొనాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. గాయం కారణంగా కోహ్లీ నాలుగో టెస్టులోనూ పరుగులు చేయకపోయినా పర్వాలేదు కానీ అతడి నాయకత్వ ప్రతిభా పాటవాలు ఖచ్చితంగా ఆటకు దోహదం చేస్తాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. రాంచీ టెస్టులో బంతిని అడ్డుకోబోయి భుజానికి గాయమైన కోహ్లీ నేడు ప్రారంభమైన నాలుగో టెస్టులో పాల్గొనడం సందేహంగా ఉన్న తరుణంలో గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
గత మూడు మ్యాచ్‌లు చూసినట్లయితే విరాట్ కోహ్లీ నిజంగానే బ్యాటింగుతో తన జట్టుకు తో్డ్పడలేదు కానీ టీమ్ లీడరుగా అతడు మైదానంలో ఉన్నాడు. టీమ్‌ను అద్బుతంగా నడిపించాడు. అందుకే కోహ్లీ పెద్దగా బ్యాటింగ్ చేయకపోయినా, అతడి లోటును కె.ఎల్ రాహుల్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు, కొంతవరకు వృద్ధిమాన్ సాహా పూరించారు. బౌలర్‌గా జడేజా కూడా జట్టుకు ఎంతో తోడ్పడ్డాడు. కానీ వీరందరినీ ప్రభావితం చేసిన లీడర్ కోహ్లీనే అని గవాస్కర్ పేర్కొన్నారు.
 
విరాట్ కోహ్లీ అనే ప్లేయర్ తన టీమ్‌కు ఎంత అవసరమో టీమ్ యాజమాన్యం పరిగణించాలి, బ్యాట్స్‌మెన్‌గా కాక ఆల్ రౌండర్ గా కోహ్లీ టెస్టు మ్యాచ్‌పై గణనీయ ప్రభావం వేయగలడు. అతడు 50 శాతం లేదా 60 శాతం, 70 శాతం ఫిట్ నెస్‌తో ఉన్నా సరే అతడు మైదానంలో ఉంటే చాలు టీమ్ మొత్తం ఉత్తేజం పొందుతుంది. తర్వాత అతడిని బ్యాటింగ్ కూడా చేయమని నచ్చచెప్పాలి. తాను వందశాతం ఫిట్‌నెస్‌తో ఉంటేనే మ్యాచ్ ఆడతానని విరాట్ వ్యక్తిగతంగా చెప్పి ఉండవచ్చు కానీ కీలకమైన చివరి మ్యాచ్‌లో అతడి ఉనికి టీమ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి పూర్తి ఫిట్ నెస్ లేకున్నా కోహ్లీని ఆడాల్సిందిగా యాజమాన్యం ప్రోత్సహించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు.